శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

BCCI Announces India’s Squad for T20 ODI Series Against Sri Lanka,India Vs Sri Lanka T20 Team Squad 2023,India Vs Sri Lanka Odi,India Vs Sri Lanka T20 Schedule,Mango News,Mango News Telugu,India Vs Sri Lanka Odi 2023,India Vs Sri Lanka Tickets,India Vs Sri Lanka 2023 Team Players List T20,India Vs Sri Lanka T20 Series 2022,India Vs Sri Lanka Team Squad 2022,India T20 Team Against Sri Lanka,T20 Series Team India,Indian Team For T20 Against Sri Lanka,India T20 Squad Against Sri Lanka 2021,Indian Team For T20 Series Against England,India T20 And Odi Squad

భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ ల కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించింది. వన్డే సిరీస్ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు. అలాగే టీ20 సిరీస్ కు కెప్టెన్‌ గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను నియమించారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా భారత్ వన్డే జట్టులో ఓపెనర్ గా కీలకంగా రాణించిన శిఖర్ ధావన్ ను శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఇటీవల కొన్ని సిరీస్‌ల్లో భారత్ జట్టుకు కెప్టెన్‌ గానూ వ్యవహరించిన శిఖర్‌ ధావన్‌ కు తాజాగా జట్టులో చోటుదక్కకపోవడం చర్చనీయాంశమైంది.

జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయాల కారణంగా ఇంకా సెలక్షన్ కు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీ20, వన్డే జట్టులో లేడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వన్డే జట్టులో ఉండగా, టీ20లకు విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ మాత్రమే టీ20, వన్డే జట్టులో ఉన్నారు. ఇక టీ20 సిరీస్‌ కోసం ముకేశ్ కుమార్ కు కూడా జట్టులో చోటు లభించింది. కాగా ఐపీఎల్ ప్రారంభమయ్యాక, ఐపీఎల్ లో ఆడకుండానే టీ20లు ఆడబోతున్న తొలి భారతీయ ఆటగాడిగా ముఖేష్ కుమార్ గుర్తింపు పొందనున్నాడు.

శ్రీలంకతో 3 టీ20లకు భారత్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.

శ్రీలంకతో 3 వన్డేలకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =