ఉత్తరాంధ్ర సీట్ల పంపకాలపై రచ్చ!

Controversy Over Uttarandhra Seats, Uttarandhra Seats, Uttarandhra Controversy, Uttarandhra Politics, Turpu Kaapus In Protest Over TDP Janasena BJP, Turpu Kaapus In Protest, Turpu Kaapus, TDP Janasena BJP Seats Allocation, Uttarandhra Seats Allocation, TDP, Janasena, BJP, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
uttarandhra politics turpu kaapus in protest over tdp janasena bjp seats allocation telugu news

ఏపీ రాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. కుల సమీకరణలను చూసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్లదు. ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న కాపులపై పార్టీలు ఆచితూచీ అడుగులు వేస్తాయి. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి పట్టం కట్టారు. 32 కాపులను వైసీపీ నిలబెడితే అందులో 30మంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో కాపు నేతైన పవన్‌ కల్యాణ్‌ వామపక్షలతో కలిసి బరిలోకి దిగారు. 2014లో జనసేన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో కాపులు కూటమి వైపు నిలబడ్డారు. మరి 2024 పరిస్థితి ఏంటి? ముఖ్యంగా తూర్పు కాపులు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు?

ఇటివలీ తూర్పు కాపు పెద్దలు సమావేశమయ్యారు.  టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దూరంగా ఉంచిందని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కనపాక చౌదరినాయుడు ఆరోపించారు. నిజానికి ఉత్తరాంధ్రలో కాపుల జనాభా 35 లక్షలకు పైగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో కాపు నేతలను కూటమి పట్టించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. తమ నేతలకు శ్రీకాకుళం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని తూర్పు కాపులు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ ఆ సీటును పోలినాటి వెలమ సామాజికవర్గ నేత కె.రామ్మోహన్ నాయుడుకు కేటాయించింది. కాపులు ఎక్కువగా ఉన్న ఆమదాలవలస తదితర నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కాపులు ఆరోపిస్తున్నారు.

కాపుల జనాభా, ఓటర్ల బలం ఆధారంగా వారికి అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని, లేనిపక్షంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తామని తూర్పు కాపులు హెచ్చరించడంతో రచ్చ మొదలైంది. నిన్నమొన్నటి వరకు జనసేనకు సపోర్ట్‌గా నిలిచిన నేతలు ఇప్పుడు వార్నింగ్‌లు ఇస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఉత్తరాంధ్రకు పవన్‌  కల్యాణ్‌ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. సభలు, సమావేశాలు కూడా అక్కడ నుంచి మొదలుపెడతారు. 2019లో పవన్‌ భీమావరంతో పాటు గాజువాక నుంచే పోటి చేశారు. అయితే పొత్తులో భాగంగా ఈ సారి సీట్లు టీడీపీకి వెళ్లినట్టు అర్థమవుతుంది. 2019లో తూర్పు కాపులు జనసేనతో పాటు వైసీపీకి మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఈ సారి టీడీపీ వల్ల తమకు అన్యాయం జరిగిందన్నది తూర్పుకాపు పెద్దల మాట.. మరి చూడాలి ఎన్నికల సమయానికి ఈ సెగ చల్లారుతుందో లేదో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =