జనగళమే.. యువగళమై..

Nara Lokesh Yuvagalam Padayatra, Nara Lokesh Padayatra, Yuvagalam Padayatra Nara Lokesh, Padayatra Nara Lokesh, Yuvagalam Nara Lokesh, Latest Yuvagalam Padayatra News, Yuvagalam Padayatra Updates, Yuvagalam, Yuvagalam Padayatra, TDP, Nara Lokesh, Chandrababu Naidu, CM Jagan, AP Politcal News, AP News, Andhra Prasdesh Live Updates, Mango News, Mango News Telugu
Yuvagalam, Yuvagalam Padayatra, TDP, Nara Lokesh, Chandrababu naidu

యువగళం పాదయాత్రతో పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు నారా లోకేష్. అవమానాలు, అవహేళనలు, ఆటంకాలను అధిగమించి దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ ఫుల్‌గా పాదయాత్రను ముగించారు. సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్ర అని ముందే హెచ్చరించిన లోకేష్.. చివరి వరకు అదే పట్టుదలతో ముందుకు కదిలారు. తండోప తండాలుగా జనాలు తరలివచ్చి లోకేష్‌కు నీరాజనాలు పలికారు. జనప్రభంజనం మధ్య లోకేష్ ముందుకు కదిలారు. ప్రజల సమస్యలను వింటూ.. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ. ఈక్రమంలో 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగు దేశం పార్టీ.. 2019 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయింది. లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. అంతక ముందు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారనే విమర్శ లోకేష్‌ను కుంగదీసింది. అటు అవమానాలు, అవహేళనలు కూడా ఎక్కువయ్యాయి. వీటన్నింటిని అధిగమించుకుంటూ వచ్చేలోపే ఎన్నికల సమయం ఆసన్నమయింది. దీంతో ప్రజలతో మమేకమవ్వాలని కంకణం కట్టుకున్నారు నారా లోకేష్.

ఈ మేరకు యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమయింది. 11 ఉమ్మడి జిల్లాలు.. 97 నియోజక వర్గాలు.. 2,208 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. 3,132 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి విశాఖ జిల్లా అగనంపూడి వద్ద దిగ్విజయంగా ముగించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర కూడా ఆగనంపూడి వద్దే ముగిసింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో లోకేష్ కూడా అదే సెంటిమెంట్‌తో యువగళం పాదయాత్రను ఆగనంపూడి వద్ద ముగించారు.

నిజానికి ఏపీలో తెలుగు దేశం పార్టీకి బలమైన నాయకులు.. లక్షల్లో కార్యకర్తలు ఉన్నారు. అలాగే బలమైన సామాజిక వర్గం అండతో పాటు.. బీసీల పార్టీగా టీడీపీకి పేరుంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలు తారుమారైపోయి.. టీడీపీ ఓడిపోవడంతో.. కేడర్ అయోమయంలో పడింది. చాలా మంది నేతలు కనుమరుగైపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు టీడీపీ చల్ల బడిపోయినప్పటికీ.. చంద్రబాబు పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి కనుమరుగైపోయిన నేతలను మళ్లీ జనాల్లోకి తీసుకొచ్చారు. పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

అటు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో చంద్రబాబు ఎన్నికలను పర్యవేక్షించే పనిలో పడ్డారు. ఈక్రమంలో నారా లోకేష్ కదనరంగంలోకి దూకేశారు. లోకేష్ యువగళం పాదయాత్రతో తెలుగు దేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. కార్యకర్తల్లో జోష్ రెట్టింపు అయింది. యువగళం పేరుతో యువతలో మరింత నమ్మకం పెంచారు. 2019లో ఓటమి తరువాత కనుమరుగైపోయిన నేతలు తిరిగి వెలుగులోకి వచ్చారు. అటు లోకేష్ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసి.. ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచేశారు.  మొత్తానికి విజయవంతంగా యువగళం పాదయాత్రను పూర్తి చేసి.. తన సత్తా ఏంటో రుజువు చేసుకున్నారు నారా లోకేష్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =