గూగుల్ తొలగించిన యాప్‌లపై కేంద్రం వివరణ

Goodbye To Over 2500 Apps From Play Store, Goodbye To 2500 Apps From Play Store, Over 2500 Apps removed From Play Store, Latest News Over 2500 Apps From Play Store, Latest Update Of 2500 Apps From Play Store, Latest Play Store News, RBI,Google Play Store,Google,Goodbye To Over 2500 Apps, From Play Store, Apps Removed By Google, Play Store, Mango News, Mango News Telugu
RBI,Google Play Store,Google,Goodbye to over 2500 apps, from Play Store, apps removed by Google

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు తెగ పెరిగి పోతున్న సంఘటనలే కనిపిస్తున్నాయి. అయితే ఇలా బ్యాంకులో ఉన్న సొమ్ము కాజేసే వారి కంటే కూడా లోన్ యాప్‎ల వల్లే ఎక్కువ శాతం మంది మోసపోతున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. దీంతో ఇలాంటి యాప్‌లపై గూగుల్ నిఘా ఉంచింది.  అంతేకాదు 2021 ఏప్రిల్ నుంచి 2023 జూలై మధ్యకాలంలో వచ్చిన ఇలాంటి యాప్‌లను గుర్తించిన గూగుల్.. 2,500కు పైగా మోసపూరిత రుణ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

సోమవారం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా  పార్లమెంటుకు తెలియజేసింది. ఇలా తొలగించిన మోసపూరిత రుణ యాప్‌ల వివరాలను  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఉన్న ఇంటర్ రెగ్యులేటరీ ఫోరమ్ అయిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశాలలో కూడా ఈ విషయం గురించి తాము చర్చిస్తామని  తెలిపారు.

ఇలాంటి మోసపూరిత రుణ యాప్‌ల గురించి తరచూ పర్యవేక్షించడంతో పాటు చురుగ్గా ఉండడం అవసరమని నిర్మలా సీతారామన్ చెప్పారు.  నిరంతరం ఇలాంటి యాప్‌లపై అప్రమత్తతతో ఉంటూ.. సైబర్ సెక్యూరిటీ విధానాన్ని కొనసాగించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో అటువంటి మోసాలను తగ్గించడానికి దోహదపడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడం కోసం ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని..ఇకపైన కూడా తీసుకోవడమే మోడీ  ప్రభుత్వ లక్ష్యం అని నిర్మలా సీతారామన్ చెప్పారు. మోసపూరిత రుణ యాప్‌లకు చెక్ పెట్టడానికి  తీసుకున్న చర్యలలో భాగంగా, ఆర్బీఐ తాజాగా ‘వైట్‌లిస్ట్’ విడుదల చేసింది.

భారత ప్రభుత్వం నిబంధనలకు లోబడి నడుచుకునే చట్టపరమైన యాప్‌లు కూడా కొన్ని ఉన్నాయి. వాటి జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. గూగుల్‎తో  భాగస్వామ్యం అయిందని నిర్మలా సీతారామన్ వివరించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో లోన్ లెండింగ్ యాప్‌ల అమలుకు సంబంధించి కొత్త విధానాన్ని అప్‌డేట్ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇండియాలో రుణాలు ఇచ్చే యాప్‌ల కోసం కఠినమైన అదనపు చర్యలు అమలు చేయడానికి కొత్త పాలసీలను తీసుకొచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం తాజాగా సవరించిన లోన్ యాప్‌ల విధానం ప్రకారం, ఇకనుంచి రెగ్యులేటెడ్ ఎంటీటీల భాగస్వామ్యంతో పని చేసే యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో అనుమతించబడతాయి. 2021 ఏప్రిల్ నుంచి 2023 జూలై మధ్యకాలంలో గూగులో తన ప్లే స్టోర్  నుంచి దాదాపు 3,500 నుంచి 4,000 లోన్ లెండింగ్ యాప్‌లను జాగ్రత్తగా గమనించింది. అందులో నుంచి 2,500కి పైగా మోసపూరిత రుణ యాప్‌లను గుర్తించి వాటిని సస్పెండ్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 10 =