పెట్రోల్,డీజిల్ కార్లపై నిషేధం లేదన్న గడ్కరీ

latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, Nitin Gadkari Says No Plan To Ban Petrol And Diesel, Nitin Gadkari Says No Plan To Ban Petrol And Diesel Vehicles, Nitin Gadkari Says No Plan To Ban Petrol Vehicles, No Plan To Ban Petrol And Diesel Vehicles

ప్రస్తుతం దేశంలో పెట్రోల్,డీజిల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం నాడు స్పష్టం చేశారు. ఉపాధిరంగంలో ఆటోమెబైల్ రంగం పాత్రను ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. దేశ ఎగుమతుల్లో ఆటోమెబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ఆ రంగం ఇటీవల కొన్ని ఒడిదుడుకులు ఎదురుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లో అపోహ ఉందని, ప్రభుత్వానికైతే అటువంటి ఆలోచన లేదని చెప్పారు. హైబ్రీడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

గురువారం నాడు ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ సొసైటీ (సియామ్) వార్షిక సమావేశంలో పాల్గొన్న నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ, పెట్రోల్,డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున రవాణా శాఖకు సందేశాలు వస్తున్నాయని, అయితే ఈ విషయంపై మంత్రివర్గంలో చర్చించామని నిషేధించే ప్రణాళికలు లేమి చేయడం లేదని చెప్పారు. దేశంలో వాహనాలు పెద్ద సంఖ్యలో ఉండడం వలన ముడి చమురు దిగుమతుల విషయంలో, కాలుష్యం, రహదారుల భద్రతా లోనూ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, ఆటో మొబైల్ రంగం ఇకనైనా పరిశుభ్ర ఇంధనం వైపు మళ్లాల్సిన అవసరముందని చెప్పారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here