ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్

Pawan focus on both Godavari districts,Pawan focus,focus on Godavari districts,Pawan Kalyans Special Focus,Special Focus On Konaseema,Pawan competition from Kakinada,Pawan focus on both Godavari districts,Janasena, Pavan Kalyan, Dwarampudi Chandra Sekhar,TDP, Janasena,Mango News,Mango News Telugu,Pawan focus on Kakinada,kakinada city assemble seet,Pawan Conducts Meeting With Cadres,Kakinada Latest News,Kakinada Latest Updates,Godavari districts Latest News,Godavari districts Latest Updates
Pawan competition from Kakinada?,Pawan focus on both Godavari districts,Janasena, Pavan Kalyan, Dwarampudi Chandra Sekhar,TDP, Janasena

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా మూడురోజుల పాటు  పర్యటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని చెబుతున్న కాకినాడ సిటీతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తుంది. అయితే పవన్ ఈ జిల్లా విషయంలో చాలా స్ట్రాంగ్‌గా నిలబడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా.. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సీట్లు అత్యంత కీలకంగా మారుతూ ఉంటాయి. అందుకే పార్టీలన్నీ ముఖ్యంగా ఈ రెండు జిల్లాలపైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాయి. టీడీపీతో జనసేన పొత్తులో భాగంగా.. ఈ జిల్లాల నుంచి ఎక్కువ స్థానాలు తీసుకోవాలని భావిస్తున్న పవన్ … మెయిన్‌గా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా అయినా గద్దె దించేలా చేయాలని.. అంతకంటే ముందు ముఖ్యంగా జనసేన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా కాపాడుకోవాలని జనసేనాని బలంగా భావిస్తున్నారు. తనతో పాటు  జనసేన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి తీసుకెళ్లాలని, తమ స్వరం అక్కడ గట్టిగా వినిపించాలని భావిస్తున్నారు. దీంతో  ఏపీలో కీలకంగా ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 8 నియోజకవర్గాలపై పవన్ ఇప్పుడు  దృష్టి సారించారు.అంతేకాదు తాను కూడా తూర్పుగోదావరి నుంచే పోటీ చేయడానికి పవన్ పావులు కదుపుతున్నారు.

అయితే  వారాహియాత్రలో భాగంగా  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ,పవన్ కళ్యా‌ణ్‌కు మధ్య  మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు మధ్యలో ముద్రగడ కూడా ఎంటరవ్వడంతో పవన్ సైలంట్ అయిపోయారు. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వనని చేసిన శపథాన్ని మాత్రం పవన్ ఇప్పటికీ మర్చిపోలేదట. ఇప్పటికీ  ఎలా అయినా ద్వారంపూడికి తగిన శాస్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారని జనసైనికులు  అంటున్నారు.

ద్వారంపూడిపై గట్టి పోటీ ఇవ్వడానికి వేరే అభ్యర్థిని నిలబెట్టడం కంటే తాను నిలబడితే బెటరని పవన్ ఆలోచిస్తున్నారట. అక్కడ జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నట్లు వార్తలు అందడంతో.. కాకినాడ సిటీలోని ప్రతీవార్డు గురించీ జనసేన నేతలతో చర్చిస్తున్నారట. ఇదే సమయంలో తాను మొదటి నుంచీ అనుకున్నట్లుగా.. మిగిలిన 7 స్థానాల్లోనూ కచ్చితంగా జనసేన అభ్యర్థులతోనే పోటీ చేయించాలని పవన్ పట్టుదలతో ఉన్నారు.

కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి.. కాకినాడ రూరల్, అమలాపురం, రాజమండ్రి రూరల్, పిఠాపురం,  ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులతో పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ ఎనిమిది స్థానాలనూ ఎలా అయినా గెలవాలని.. తాను పోటీ చేస్తున్న ప్రభావం.. తూర్పు గోదావరి జిల్లా అంతా ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారంట.

ఇప్పటికే డిసెంబర్ 28, డిసెంబర్  29, డిసెంబర్  30 వరుసగా మూడురోజులు కాకినాడలో పర్యటించిన పవన్ కల్యాణ్… జనవరి 3వ తేదీ  తర్వాత  మరో మూడు రోజుల పాటు కాకినాడలోనే పర్యటించబోతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నారయి. ఈ పర్యటనలో ఉన్నప్పుడే తాను పోటీ చేయాలని భావిస్తున్న కాకినాడ సిటీతో పాటు.. మిగిలిన 7 స్థానాలలో ఫైనల్ లిస్ట్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =