మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సజ్జనార్ కీలక ప్రకటన

Free Bus Travel for Women Sajjanars Key Announcement,Free Bus Travel for Women,Sajjanars Key Announcement,Travel for Women,TSRTC, VC Sajjanar, GHMC, Free Ticket, Family 24, T 6 Ticket,Mango News,Mango News Telugu,Telangana Free Bus Travel Scheme,Mahalaxmi Free Bus Travel Scheme,Telangana rolls out free bus,Mahalakshmi scheme,Free Bus Travel Latest News,Sajjanars Key Announcement Latest News,Sajjanars Key Announcement Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
TS RTC, VC Sajjanar, GHMC, Free Ticket, Family-24, T-6 Ticket

తెలంగాణలో కొలువుదీరిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే మహాలక్ష్మీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి భారీగా స్పందన వస్తోంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నప్పనుంచీ.. బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఖాళీగా దర్శనమిచ్చే బస్సులన్నీ.. ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి.

అటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి పలక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అటు కండక్టర్లు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో పరిధిలో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఆర్టీసీ అందిస్తోంది. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఆ టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

ప్రయాణికులకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేసే సమయంలో బస్ కండక్టర్ వారి గుర్తింపు కార్డులును చూసి.. వారి వయస్సును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. దీంతో కండక్టర్లకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఈక్రమంలో సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది.

ఈ సమస్యల దృష్ట్యా ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు సజ్జానార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  ఈ నిర్ణయం జనవరి 1 అంటే ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వివరించారు. ఈరోజు నుంచి ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయమని.. ప్రయాణికులు సహకరించాలని సజ్జనార్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =