కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఓదార్పు

AP News, Janasena, janasena chief, janasena chief pawan kalyan, Janasena Latest News, janasena news, Kalyan, latest news today, latest news updates today, latest telugu news, latest telugu news updates, Mango News Telugu, Pawan, pawan kalyan, Pawan Kalyan Consoles Bereaved Party, Pawan Kalyan Consoles Bereaved Party Activist, Pawan Kalyan Consoles Bereaved Party Activist’s Family, Pawan Kalyan Latest News, pawan kalyan news, pawankalyan, telugu news

భీమవరం మండలం తాడేరు గ్రామంలో అనారోగ్యానికి గురై మృతి చెందిన అభిమాని, జనసేన పార్టీ కార్యకర్త కొప్పినీడి మురళీకృష్ణ కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మురళీకృష్ణ తల్లి, భార్య,ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు, మురళీకృష్ణ ఎలా మృతి చెందాడనే అనే విషయంపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. అతని తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు, వారిని ఓదార్చే క్రమంలో భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ బాధతో కన్నీరు పెట్టుకున్నారు. మీరు గెలిచిన నాడు తన కొడుకు ఆత్మ శాంతిస్తుందని మురళీకృష్ణ తల్లి చెప్పడంతో పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ట్రస్ట్ నుంచి రూ 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో మురళీకృష్ణ భార్య శ్రీమతి ఊహ జ్యోతికి అందించారు. వారి కుటుంబానికి ఒక కొడుకులా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మురళీకృష్ణ పిల్లల చదువులు, భవిష్యత్ జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మురళీకృష్ణ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కష్ట పడ్డాడని, తన అన్నయ్య నాగబాబు మురళీకృష్ణ చనిపోయిన విషయం తన దృష్టికి తీసుకొచ్చాడని తెలిపారు. అలాంటి కార్యకర్త కాన్సర్ వ్యాధితో మృతి చెందడం తనను కలిచివేసిందని చెప్పారు. స్థానిక నాయకుడు రమేష్ పార్టీ తరుపున మరో లక్ష రూపాయలు వారి కుటుంబానికి అందజేస్తారని చెప్పారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మరియు ఇతర నాయకులు మురళీకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here