ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన

amit shah, AP NEWS, Finance Minister of India, modi, Narendra Modi, PM Modi, PM Modi And President Kovind, PM Narendra Modi, President Kovind, President of India, President Ram Nath Kovind, Ram Nath Kovind, telugu news, ys jagan, YS Jagan To Meet PM Modi, YS Jagan To Meet PM Modi And President Kovind,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆగస్టు 6న ఢిల్లీ చేరుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యి రాష్ట్ర సమస్యలను చర్చించనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలను చర్చించి, పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలనీ కోరనున్నారు. అమిత్ షా తో సమావేశం అనంతరం, సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ని కలవనున్నారు.

ప్రధాని మోడీతో జరిగే భేటీలో, రాష్ట్రం ఎదురుకుంటున్న సమస్యలు, గతం నుంచి పెండింగ్లో ఉన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు,రాష్ట్రానికి అవసరాలకనుగుణంగా తక్షణ ఆర్థిక సహాయం చేయాలనీ సీఎం జగన్ కోరనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు పై ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు, అంతే కాకుండా విద్యుత్ ఒప్పందాలపై గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతుండడంతో, దానికి సంబంధించిన వివరణ ఇవ్వనున్నారు. ఆగస్టు 6వ తేదీన సీఎం జగన్ ఢిల్లీలోనే బస చేస్తారు.

బుధవారం, ఆగస్టు 7న ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. సాయంత్రం వరకు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం, సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

 

[subscribe]
[youtube_video videoid=QER3OYNj0NM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =