రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

Janasena Pawan Kalyan Responds Over MLA Rapaka Varaprasad, Janasena Pawan Kalyan Responds Over MLA Rapaka Varaprasad Arrest, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan Responds Over MLA Rapaka, Pawan Kalyan Responds Over MLA Rapaka Varaprasad, Pawan Kalyan Responds Over MLA Rapaka Varaprasad Arrest, Pawan Kalyan Responds Over MLA Rapaka Varaprasad’s Arrest

తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో ఆయనే నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మలికిపురంలో జరిగిన ఈ సంఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల తరుపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై ఇటువంటి కేసులు పెట్టడం సరికాదని అన్నారు.

ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారని, అలాంటి వ్యక్తిపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. మరో వైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జర్నలిస్టు పై దాడికి పాల్పడితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇక్కడ స్టేషన్ లో జరిగిన చిన్న సంఘటనకి అరెస్ట్ వారంట్ ఇచ్చారని విమర్శించారు. మలికిపురంలో జరిగిన ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చారని అన్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షిస్తున్నట్టు చెప్పారు. అక్కడ పరిస్థితులు చేయిదాటిపోయి శాంతిభద్రతలు సమస్యలు రాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలు సంయనంతో ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసారు. ఒకవేళ పరిస్థితి అదుపుతప్పి, జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తానే స్వయంగా రాజోలు వచ్చి మద్దతుగా నిలుస్తానని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=Lwwr3azfisE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 4 =