రాష్ట్ర భవిష్యత్తుకై కదం తొక్కిన పెమ్మసాని

Pemmasani Who Stepped On The Footsteps Of The Future Of The State, Pemmasani Who Stepped On The Footsteps, Future Of The State, Pemmasani Political News, Guntur Candidate, Guntur MP Candidate, Pemmasani, Pemmasani Chandrasekhar, AP Politics, Guntur, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani, pemmasani chandrasekhar, ap politics, guntur

అమెరికాలో చదువు.. డాక్టర్ వృత్తి.. మంచి వ్యాపారాలు.. విలాసవంతమైన జీవితం. అయినా కూడా ఆయనకు సంతృప్తిలేదు. పుట్టినగడ్డపైనే ఆయన మనసంతా. ఎప్పుడూ సొంత ఊరు.. సొంత ప్రజలే ఆయన ఆలోచనలు. వారికోసం ఏమైనా చేయాలనే ఆయన తపనంతా.. గత 20 ఏళ్లుగా పుట్టిన ఊరికి.. సొంత ప్రజలకు దూరంగా ఉంటున్నప్పటికీ సొంత నిధులతో ప్రజల కష్టాలు తీర్చుతున్నారు. ఆపద ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. దూరంగావున్న మీకు అండగావున్న అనే భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం అన్నీ వదులుకొని సంత గడ్డకు తొరిగొచ్చారు. ప్రజాసేవకై కదం తొక్కారు. ఆయనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.

పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం గ్రామం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసిన పెమ్మసాని.. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. డాక్టర్ వృత్తిలో అక్కడే స్థిరపడిపోయారు. పేరుకే అక్కడ ఉంటున్నప్పటికీ.. ఆయన ఆలోచనలు, మనసంతా సొంతగడ్డపైనే. గత ఇరవై సంవత్సరాలుగా గుంటూరులో పెమ్మసాని ఫ్యామిలీ పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినప్పటికీ.. అధికారులు నిర్లక్ష్యం చేసినప్పటికీ గుంటూరు ప్రజలకు పెమ్మసాని కుటుంబం అండగా ఉంటోంది.

పల్నాడు ప్రాంతంలో ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ఉంది. అక్కడి ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ సొంత నిధులతో పల్నాడు ప్రజల నీటి సమస్యలను తీర్చారు. సొంత నిధులతో ఆ ప్రాంతంలో 120 బోర్లు వేయించారు. బుర్రిపాలెం, తెనాలితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల కోసం అమెరికా నుంచే యూ వరల్డ్ అనే ఆన్‌లైన్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేశారు.  నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ పెమ్మసాని చంద్రశేఖర్ మనసులో ఏదో అసంతృప్తి ఉండేది. సొంత గడ్డకు ప్రజలకు దగ్గరంగా ఉంటే మరింత అభివృద్ధి చేయొచ్చు కదా.. పేద ప్రజల జీవితాలు మార్చొచ్చు కాదా అనే ఆలోచన. అందుకే అన్నీ వదులుకొని అమెరికా నుంచి సొంత ఊరికి తిరిగొచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు అభివృద్ధే ధ్యేయంగా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. తెలుగు దేశం పార్టీ తరుపున గుంటూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇన్నిరోజులు తమకు దూరంగా ఉండి సేవ చేసిన నాయకుడు.. ఇప్పుడు తమకోసం కదలివస్తుండడంతో గుంటూరు ప్రజలు ఆయనకు జై కొడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =