ఓటర్లు ఎలాంటి విలక్షణమైన తీర్పునిస్తారు?

Will TDP Get A Check In Palakollu This Time?,TDP,Palakollu,Palakollu Voters Typical Judgments,YCP,Janasena,Chandrababu,Jagan,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Palakollu Politics,Palakollu Elections,TDP News,TDP Latest News

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం అయిన పాలకొల్లు.. ఏపీ రాజకీయాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. విలక్షణ తీర్పులు ఇవ్వడంలో ఇక్కడ ఓటర్లు ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి,దాసరి నారాయణరావు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వారే.

కాపు సామాజికవర్గానికి అడ్డాగా ఉన్న  పాలకొల్లు నియోజకవర్గంలో  రెండు సార్లు  కూడా టీడీపీ జెండానే ఎగిరింది.2014,2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అయిన  నిమ్మల రామానాయుడు గెలుపొందారు.

ఈసారి కూడా గెలిచి పాలకొల్లులో హ్యాట్రిక్ కొట్టాలని రామానాయుడు భావిస్తుండగా..రామానాయుడిని ఎలా అయినా కట్టడి చేసి వైఎస్సార్సీపీ జెండాను అక్కడ ఎగురవేయించడానికి గుడాల గోపి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. తన స్వస్థలం పాలకొల్లులోనే ఓడిపోయారు. అప్పట్లో చిరంజీవి ఓటమి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపగా..అన్ని పార్టీలను కాదని తెలుగు దేశం పార్టీ నుంచి రామానాయుడు విజయాన్ని సాధించారు.

పాలకొల్లులో మొత్తం లక్షా 90 వేల మంది ఓటర్లు  ఉండగా కాపు సామాజికవర్గం ఓటర్లే 52 వేలు మంది ఉన్నారు. ఈ ఎన్నికలలో పాలకొల్లు ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ను కాదని గోపికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం జగన్. అంతేగాదు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన గుణ్ణం నాగబాబుతో పాటు మేకా శేషుబాబును కూడా గోపి విజయం కోసం పని చేయాలని జగన్ ఆదేశించారు.దీంతో ఈ సారి ఎన్నికలలో పాలకొల్లు పోటీ  మరింత ఆసక్తికరంగా మారింది.  పాలకొల్లులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ  ఆ  నియోజకవర్గంలోనే కాదు ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =