ప్రజల నాయకుడు పెమ్మసాని

Pemmasani Is The Leader Of The People, People Leader Pemmasani, Pemmasani Is The People Leader, People Leader, Guntur Candidate, Guntur MP Candidate, Pemmasani, Pemmasani Chandrasekhar, AP Politics, Guntur, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani, pemmasani chandrasekhar, ap politics, guntur

పదవులు.. పలుకుబడి.. సంపాదన.. ఇదే ఈకాలం నాటి రాజకీయ నాయకుల అజెండా. పదవులు అనుభవించడం.. అందిన కాడికి దండుకోవడమే వారి ధ్యేయం. పేరుకు ప్రజాసంక్షేమం, అభివృద్ధి అని చెప్పినప్పటికీ.. వారి అవసరం తీరాక వాటిని తుంగలో తొక్కుతుంటారు. కానీ ఎటువంటి పదవులు ఆశించకుండా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా..  రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కదిలివస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. నికార్సయిన రాజకీయ నాయకుడిగా పెమ్మసాని ముందుకు కదులుతున్నారు. అమెరికాలో పేరుమోసిన డాక్టర్.. దిగ్గజ వ్యాపారవేత్త అయినప్పటికీ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని.. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో అడుగులేస్తున్నారు.

అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే నిధులు లేవని సాకులు చెప్పే నాయకులున్న ఈరోజుల్లో.. సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని చెబుతున్న దుమ్మున్న లీడర్ పెమ్మసాని చంద్రశేఖర్. రాజకీయాల్లో లేకముందే పెమ్మసాని చంద్రశేఖర్ సొంత నిధులతో గుంటూరులో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యను తీర్చారు. విద్యార్ధులకు మొరుగైన విద్య అందించేందుకు కృషి చేశారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానని అభయమిచ్చారు. కులం, మతం, వర్గం అనే బేధాలు లేకుండా సొంత నిధులు వెచ్చించి ప్రజలకు సేవ చేశారు.

ఇప్పుడు గుంటూరు ప్రజలకు మరింత సేవ చేయాలని.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలనే బలమైన ఆశయంతో పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు కదులుతున్నారు. రాష్ట్రానికి ఏదో చేయాలని.. విద్యార్థులకు స్పూర్తిదాయకంకగా ఉండాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతమున్న వైసీపీ ప్రభుత్వం లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తామని గతంలో గొప్పలు చెప్పింది. కానీ ఇప్పటికీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తానొక్కడినే లక్ష మందికి ఉపాధి కాల్పిస్తానని అంటున్నారు. హామీ ఇవ్వడమే కాకుండా ఎలా ఉద్యోగావకాశాలు కల్పిస్తారో చెబుతున్నారు.

తెనాలిలో ఇప్పటికే ఇంటర్నేషనల్ స్థాయిలో పెమ్మసాని చంద్రశేఖర్ విద్యా సంస్థలను నెలకొల్పారు. ఇప్పుడు సొంత నిధులతో గుంటూరులో మరిన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఒక్కో పాఠశాల కోసం రూ. 20 నుంచి 30 కోట్లు సొంత నిధులు ఖర్చు చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మిస్తానని చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. వ్యవసాయం, చేనేత, రిటైల్, విద్య తదితర రంగాల్లో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలనేదే తన సంకల్పమని పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =