ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, నాలుగుకు చేరిన సంఖ్య

Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, MLA Kilari Rosaiah Tested Positive, Ponnur MLA Kilari Rosaiah, Ponnur MLA Kilari Rosaiah Tested Positive for Covid-19, Ponnur MLA Tested Positive

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎలాంటి జలుబు, జ్వరం లక్షణాలు లేవని, పాజిటివ్‌ గా తేలగానే హోం క్వారంటైన్‌కు వెళ్లినట్టు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 16934 కు చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here