ఓ పోలీస్ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్..

Prabhakar Rao Phoned A High Police Officer,Govt,Prabhakar Rao,SIB DSP,Mango News,Phone Tapping Scandal,Phone Tapping,Phone Tapping,Praneeth Rao,SIB,Revanth Reddy,CM Telangana,Telangana,Telangana News,Telangana Latest News,Hyderabad,SP Bujanga Rao,Phone Tapping Case,Hyderabad Police,Bhupalpally Additional SP Bhujanga Rao,Two Additional DSPs Arrested,Telangana Phone Tapping Case,Prabhakar Rao Latest News,Mango News Telugu

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొద్దిరోజులుగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుతో సహా మరో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రణీత్ రావు, ఏ3గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్నలను చేర్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఏ1 ప్రభాకర్ రావు ఓ పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనపై కేసు నమోదయిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లారు. తాజాగా అమెరికా నుంచి ఆయన ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని ఫోన్‌లో ప్రభాకర్ రావు.. ఉన్నతాధికారికి చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు మేం కూడా ప్రభుత్వం చెబితే పనిచేశాం. ఎంతైనా మనం పోలీసులం.. మనం.. మనం ఒకటి. మా ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారు..?’’ అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు అడిగారట. దీంతో ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్‌కు పూర్తిగా సమాధానం రాసి పంపండి’’ అని బదులిచ్చారు.

ఇటీవల ఈ కేసులో భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని.. ఈ వ్యవహారం వెనుక ఓ బీఆర్ఎస్ కీలక నేత ఉన్నారని తిరుపతన్న, భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడంతో.. ఆయనే కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు ఖరారు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =