సూళ్లూరుపేటలో భారీ థియేటర్‌ ప్రారంభించిన రామ్ చరణ్

Actor Ram Charan Latest news, AP Latest News, Largest Screen At Sullurupeta In Nellore, Mango News Telugu, Mega Power Star Ram Charan, Ram Charan Inaugurates Largest Screen, Ram Charan Inaugurates Largest Screen In AP, Ram Charan Inaugurates Largest Screen In Nellore, Ram Charan Inaugurates Largest Screen In Sullurupeta, Ram Charan Inaugurates Largest Screen Of UV Creations, Ram Charan Latest Movie Updates

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరలో పిండిపాళెం వద్ద ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రూ.40 కోట్ల రూపాయలతో భారీ థియేటర్‌ ను నిర్మించారు. ప్రపంచంలో మూడో అతి పెద్దది, దేశంలోనే అతిపెద్ద తెర తో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్‌ ను నిర్మించారు. వి-ఎపిక్ గా పేరుపెట్టిన ఈ మల్టీప్లెక్స్ ను గురువారం నాడు స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు. ఈ థియేటర్‌ లో 30వ తేదినుండి సాహో చిత్రం ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తైన తెరతో 656 సీట్లతో 3డి సౌండ్ సిస్టంతో ఈ థియేటర్‌ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికంగా నిర్మించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద తెరతో థియేటర్‌ నిర్మించడం అభినందనీయం, త్వరలో విడుదల కాబోయే సైరా సినిమాని కూడ ఇక్కడ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ తో పాటు, థియేటర్‌ నిర్వాహకులు, సాహో దర్శకుడు సుజీత్, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=nrW8TEorEyQ]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =