ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి

Andhra Pradesh, Andhra Pradesh Finance Department, Andhra Pradesh Finance Department Confirms Salaries, Andhra Pradesh New PRC, Andhra Pradesh PRC, Andhra Pradesh PRC Issue, AP Employees PRC Issue, AP orders salary in new payscales, AP PRC Issue, Mango News, PRC Issue, PRC Issue in Ap, Sajjala Ramakrishna Reddy, Sajjala Ramakrishna Reddy Press Meet, Sajjala Ramakrishna Reddy Says The Govt Has No Intention of Doing Injustice To The Employees, Salaries will be paid according to new PRC

ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలకు అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వచ్చారని.. పీఆర్సీ సహా అన్ని అంశాలపై చర్చించామని సజ్జల తెలిపారు. కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని.. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ అనేదే లేదన్నారు. అయితే, ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం తరపున తాము సిద్ధంగా ఉన్నామన్నారు సజ్జల.

ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయాలని కోరుకోవడం లేదన్నారు. అలాగే, హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు సజ్జల. ఇది పాజిటివ్‌ చర్చగానే తాము భావిస్తున్నామని.. ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. ఈరోజు మంత్రుల కమిటీ తో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు అయ్యారు. ఓపెన్ మైండ్ తోనే చర్చలు చేస్తున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు ప్రస్తావించిన  కొన్ని అంశాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం సరికాదు.

ఈ విషయంలో హై కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం అని సజ్జల అన్నారు.  అసలు చర్చించాల్సిన అంశాలు వదిలి దానిపైనే ఉద్యోగ సంఘాలు ఎందుకు పట్టుబడుతున్నాయో అర్ధం కావడం లేదు. ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేసేందుకే ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసింది. అవసరమైతే, మరోసారి ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని సజ్జల తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + twenty =