కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget 2022 Modi Govt’s ‘Zero Sum Budget’ Has Nothing For The Middle Class, Budget session of Parliament, Budget Session of Parliament To Be Started, Budget Session of the Parliament 2022, CM KCR, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Live Updates, Parliament Budget Session Start, Parliament Budget Session Updates, PM Modi, rahul gandhi, Rahul Gandhi Over Budget 2022, Union Budget, Union Budget 2022-23, Union Budget 2022-23 Live Updates, Union Budget 2022-23 Updates, Zero Sum Budget

సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తన స్పందనను వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకించి ఏ ఒక్క వర్గానికి మేలు చేకూర్చేలా లేదన్నారు రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో.. మీడియా ఆయనతో మాట్లాడాలని ప్రయత్నించినా ఏమీ మాట్లాడకుండా తన కారులో వెళ్లిపోయారు రాహుల్ గాంధీ. అయితే, ఇది జరిగిన కొద్దిసేపటికే, రాహుల్ గాంధీ 2022 బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బడ్జెట్ జీరో బడ్జెట్ అని పిలిచారు. జీతభత్యాలు, మధ్యతరగతి పేదలు, యువత, రైతులకు.. ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఉపశమనం దొరకలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

పన్నుల వసూళ్ల భారంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అయితే పన్నుల వసూళ్లే మోదీ ప్రభుత్వానికి పెద్ద అచీవ్‌మెంట్ అని రాహుల్ గాంధీ గతంలో ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. వారు తమ సంపదను మాత్రమే చూస్తారు.. ప్రజల బాధలను కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కూడా బడ్జెట్ గురించి స్పందించారు. ఏడేళ్ల తర్వాత కూడా, రాబోయే 25 ఏళ్లకు తప్పుడు కలలు చూపిస్తున్నారు అని ఆయన అన్నారు. సభలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ‘మూడేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఆయన హామీలు నమ్మశక్యంగా లేవని’ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =