శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు

Andhra Pradesh Breaking News, Andhra Pradesh Latest News, Mango News Telugu, Political Updates 2019, Srisailam 6 Gates Lifted Again To Discharge Huge FloodTelangana Political Live Updates, Srisailam Project 6 Gates Lifted, Srisailam Project 6 Gates Lifted Again, Srisailam Project 6 Gates Lifted Again To Discharge Huge Flood, Srisailam Project Gates Lifted Again To Discharge Huge Flood, Srisailam Project Latest News, telangana, Telangana Breaking News

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేరకు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తిన సమయంలో అధికారుల అలసత్వం వలన స్పిల్ వే నుంచి కాకుండా కొన్ని క్రస్ట్ గేట్లు పై నుంచి వరద నీరు పారింది. అప్రమత్తమైన అధికారులు కొంత సమయంలోనే గేట్లను సరిచేసారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.9 అడుగుల మేరకు నీటి మట్టం నమోదయింది.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.32 టీఎంసీల నీరు జలాశయంలో ఉంది. భారీ వరద నీరు చేరడంతో హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకానికి, కల్వకుర్తి ఎత్తిపోతల పధకానికి, కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాలకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కూడ 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం 589.2 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 309 టీఎంసీల నీరు ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=zsZKEb2u-R8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =