వరద బాధితుల్ని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి: చంద్రబాబు

TDP National President Nara Chandrababu Naidu Appeals NGOs Humanitarians Donors to Help Flood Victims in AP, TDP President Chandrababu Appeals NGOs Humanitarians Donors to Help Flood Victims in AP, TDP Chief Chandrababu Appeals NGOs Humanitarians Donors to Help Flood Victims in AP, TDP Chief Chandrababu Appeals Humanitarians Donors to Help Flood Victims in AP, TDP Chief Chandrababu Appeals NGOs to Help Flood Victims in AP, Flood Victims in AP, AP Flood Victims, Humanitarians Donors, NGOs, TDP National President Nara Chandrababu Naidu, TDP President Chandrababu, Nara Chandrababu Naidu, TDP Chief Chandrababu, AP Flood Victims News, AP Flood Victims Latest News, AP Flood Victims Latest Updates, AP Flood Victims Live Updates, Mango News, Mango News Telugu,

వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా దాతలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో వున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది, మానవత్వాన్ని మరచింది. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయి. కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుండి 7 రోజులు నిల్వ ఉండిపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయింది. ఫ్యాన్లు, టీవీలతో పాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికిరాకుండా పోయిన దృశ్యాలు నా పర్యటనలో చూశాను” అని చంద్రబాబు అన్నారు.

“వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచింది. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి. స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకోవాలి. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ కొంత మేరకు సాయం అందించింది, సాయం కొనసాగిస్తున్నది. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా వున్నది. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను కోరుతున్నాను. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎస్ఆర్ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =