‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Hoists National Flag in NTR Trust Bhavan Hyderabad Today, Chandrababu Naidu Hoists National Flag in NTR Trust Bhavan Hyderabad Today, National Flag in NTR Trust Bhavan Hyderabad Today, Hyderabad NTR Trust Bhavan, NTR Trust Bhavan, National Flag, TDP Chief Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Flag Hoisting at NTR Trust Bhavan, NTR Trust Bhavan Flag Hoisting, Independence Day Celebrations, Chandrababu Naidu News, Chandrababu Naidu Latest News And Updates, Chandrababu Naidu Live Updates, Mango News, Mango News Telugu,

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను ప్రారంభించిన చంద్రబాబు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగస్వాములు కావడం మనందరి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఈ సందర్భంగా మనకు స్వాతంత్య్రం రావడానికి కారణమైన స్వాతంత్య్ర సమర యోధులను, మహానీయులను స్మరించుకోవడం మన విధి అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖ నేతలకు ఘనంగా నివాళులు అర్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోన్న ‘హర్ ఘర్ తిరంగా’ ఎంతో గొప్ప కార్యక్రమం అని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, తద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో జాతీయ భావం పెల్లుబికాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =