దేశంలో అదుపులోనే కరోనా వ్యాప్తి, కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే?

India, India Covid-19, 68 Deaths Reported on India August 12th, 15815 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కొంత హెచ్చుతగ్గులతో 15 నుంచి 21 వేల మధ్య రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,815 పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆగస్టు 13, శనివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,42,39,372 కు, మరణాల సంఖ్య 5,26,996 కి పెరిగిందని తెలిపారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,62,802 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 87.99 (87,99,00,242) కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 4.36 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 4.79 శాతంగా ఉంది.

అలాగే గత 24 గంటల వ్యవధిలో 20,018 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,35,93,112 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.54 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 1,19,264 (0.27%) మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here