జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక భేటీ

TDP Chief Chandrababu Naidu Meets Janasena President Pawan Kalyan in Vijayawada, TDP Chief Chandrababu Naidu , Janasena President Pawan Kalyan, Chandrababu Meets Pawan Kalyan, Mango News, Mango News Telugu, Chandrababu Naidu, Pawan Kalyan, Janasena Party, Andhra Pradesh Latest Political News, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కలిసినట్టు తెలుస్తుంది. విశాఖ ఘటనతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురూ నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తన సహనాన్ని చూశారని, ఇకపై యుద్ధానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్యాకేజి స్టార్ అని సంబోధిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తామని, రాళ్లు, హాకీ స్టిక్స్, రాడ్లు, చేతులు, దేనితోనైనా యుద్దానికి సిద్ధం అని సవాల్ చేశారు.

వైఎస్సార్సీపీలో కూడా గౌరవప్రదమైన వ్యక్తులు కూడా ఉన్నారని, అలాంటి వారికి మర్యాద ఇస్తానని, కానీ బూతులు తిట్టే నేతలకే వార్నింగ్ ఇస్తున్నానని హెచ్చరించారు. ఏపీలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా మొదలైన రాజకీయ అలజడి, ఇరూ పార్టీల నేతల మధ్య ఘాటైన మాటల యుద్ధంతో రోజురోజుకి మరింత ముదురుతోంది. ఈ పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ తో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే పెద్దఎత్తున మొదలైంది. మరోసారి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన పొత్తుగా వెళ్ళబోతున్నాయా అనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో, ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =