దేశంలోని రైతులకు గుడ్ న్యూస్, ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

Union Cabinet Approves Minimum Support Prices for Rabi Crops for Marketing Season 2023-24, Center Increased Minimum Price For Six Types Of Rabi Crops, Good News For Indian Farmers , Minimum Price For Six Types Of Rabi Crops, Mango News, Mango News Telugu, Cabinet Increases Minimum Support Prices, MSP Approved Designated Rabi Crops, Indian Rabi Crops, Govt Announces Msp Of Rabi Crops, Minimum Support Price, MSP 2023-24 , Msp Crops List 2023-24, Msp For Rabi Crops, MSP Latest News And Updates, Minimum Support Prices

దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ అందింది. దేశవ్యాప్తంగా 2023-24 మార్కెటింగ్ సీజన్‌లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. పంటలను సాగుచేసే రైతులకు, వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను కల్పించడం కోసం ప్రభుత్వం రబీ మార్కెటింగ్ సీజన్ 2023-24లో కనీస మద్ధతు ధరను పెంచినట్టు పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర పెరిగిన ఆరు పంటలివే, (క్వింటాల్‌కు):

  • గోధుమలపై కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెంపు – ధర రూ.2125 గా నిర్ణయం
  • బార్లీపై రూ.100 పెంపు – ధర రూ.1735
  • రేప్‌సీడ్స్ అండ్ ఆవాలుపై రూ.400 పెంపు – ధర రూ.5450
  • మసూర్(లెంటిల్) పప్పుపై రూ.500 పెంపు – ధర రూ.6000
  • కుసుమలు/ స్ఫఫ్లవర్ పై రూ.209 పెంపు – ధర రూ.5650
  • గ్రామ్/శనగలపై రూ.105 పెంపు – ధర రూ.5335.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seven =