లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani Srinivas Yadav Distributes Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Telangana Minister Talasani Srinivas Yadav Distributes Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Talasani Srinivas Yadav Distributes Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Srinivas Yadav Distributes Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Minister Talasani Distributes Kalyana Lakshmi Scheme Checks Today at Hyderabad, Kalyana Lakshmi Scheme Checks, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Talasani Srinivas Yadav Minister for Animal Husbandary, Talasani Srinivas Yadav Minister for Fisheries and Cinematography, Kalyana Lakshmi Scheme Checks News, Kalyana Lakshmi Scheme Checks Latest News, Kalyana Lakshmi Scheme Checks Latest Updates, Kalyana Lakshmi Scheme Checks Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు లబ్ధిదారులకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం చెక్కులను అందజేశారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ. 76,56,000 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు తమ్ బిడ్డలకు పెళ్లి చేయటానికి ఆస్తులు అమ్ముకోవడానికి సైతం సిద్దపడతారని, ఈ సమస్యలను అర్ధం చేసుకున్న సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఇవి అమలవుతున్నాయి అని ప్రశ్నించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక రూ. 1,00,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ, పార్టీలకు అతీతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అమీర్ పేట డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులు విఠల్ దంపతులను మంత్రి తలసాని ఉదాహరణగా చూపించారు. వారు ఈరోజు మంత్రి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందుకోవడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 1 =