వంశీకి దెబ్బ మీద దెబ్బ.. ఒక్కొక్కరుగా జారిపోతున్న అనుచరులు

Vamsi's followers, Yarlagadda Venkatarao, Vallabhaneni Vamsi, Gannavaram, YCP, TDP, Chandrababu, Jagan Mohan Reddy,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Vamsi's followers, Yarlagadda Venkatarao, Vallabhaneni Vamsi, Gannavaram, YCP, TDP, Chandrababu, Jagan Mohan Reddy,

కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తగులుతున్న వరుస దెబ్బలు రాజకీయంగా కోలుకోనీకుండా చేస్తాయా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..తర్వాత అధికార వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఎన్నికలలో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావును వంశీ అప్పుడు ఓడించారు. అయితే వల్లభనేని వంశీ వైఎస్సార్సీపీలో చేరడంతో.. యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ఉండలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాదు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఇప్పుడు మరికొద్ది  రోజుల్లో  అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటంతో తెలుగు దేశం పార్టీ  నుంచి  గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావును చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ఆయన గన్నవరం నియోజకరవర్గంలో పాదయాత్రను కూడా చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి కూడా  విశేష స్పందన వస్తుంది. అంతేకాదు రోజురోజుకు  యార్లగడ్డ పాదయాత్రపై ప్రజాధరణ కూడా పెరుగుతోంది. ప్రజలు స్వచ్చంధంగానే  తరలివచ్చి యార్లగడ్డ వెంకట్రావు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే మారిన రాజకీయ సమీకరణాలతో.. యార్లగడ్డ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ మరింతగా బలపడుతోంది. ప్రతి రోజూ ఆయన సమక్షంలో తెలుగు దేశం పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. చివరకు వల్లభనేని వంశీ అనుచరులు కూడా యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరుతుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా వంశీకి ఇది పెద్ద దెబ్బేనన్న టాక్ నడుస్తోంది. తాజాగా వంశీ అనుచరులలో  100 మంది నాయకులు, వారి కుటుంబాలు  కూడా యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో  ఈసారి గన్నవరంలో మళ్లీ టీడీపీ గెలుపు ఖాయమని ధీమా అందరిలోనూ  వ్యక్తం అవుతోంది.

ఇటు చూస్తే వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీకి ఇంకా ఎలాంటి సీటు ఖరారు కాలేదు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఏడు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి.. రేపో మాపో ఎనిమిదో విడత జాబితాకు రెడీ అవుతోంది. కానీ ఇప్పటి వరకూ రిలీజ్  చేసిన జాబితాలలో  వల్లభనేని వంశీ పేరు లేదు. దీంతో వంశీ వర్గీయుల్లో వైసీపీపై తీవ్ర అసంతృప్తి పెరిగిపోతూ వస్తోంది. ఇటు తమ నాయకుడికి సీటు ఖరారు  కాక టెన్షన్ పడుతుంటే.. మరోవైపు  పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారి పోతుండటంతో ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తంగా వంశీ హాట్  టాపిక్‌గా మారుతున్న రాజకీయ పరిణామాలతో గన్నవరంలో పాలిటిక్స్ కాక రేపుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 13 =