టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నారా లోకేష్

TDP National General Secretary Nara Lokesh Pays Tribute To NTR on The Occasion of Party Formation Day,TDP National General Secretary Nara Lokesh,Nara Lokesh Pays Tribute To NTR,TDP on The Occasion of Party Formation Day,TDP Party Formation Day,Mango News,Mango News Telugu,TDP Party Formation Day Latest News,Tribute To NTR News Today,Nara Lokesh Latest News and Updates,Andhra Pradesh Latest News,Andhra Pradesh News and Live Updates,Nara Lokesh Latest News

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేడు 41వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం వద్ద బుధవారం ఉదయం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించిన నారా లోకేష్ పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. కాగా ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర 54వ రోజుకు చేరుకుంది. ఇక ఈ నేపథ్యంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. దీనిలో భాగంగా లోకేష్ ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి సెల్ఫీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటుండటం వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సానుకూలాంశం అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అలాగే నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వస్తున్న ప్రజలను నారా లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాదయాత్ర క్రమంలో పలు సామాజిక వర్గాలు మరియు ప్రజా సంఘాల నేతలతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు నేడు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ వద్ద తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు. కాగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా నేటి సభను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here