శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా.. రేపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad Police Announces Traffic Restrictions For Tomorrow During Sri Rama Navami Shobha Yatra,Hyderabad Police Announces Traffic Restrictions,Sri Rama Navami Shobha Yatra,Traffic Restrictions For Tomorrow,Mango News,Mango News Telugu,Traffic advisory issued for Sri Rama Navami,Hyderabad Traffic curbs,Sri Ram Navami procession,hyderabad traffic news today,Latest News on Hyderabad Traffic,Traffic advisory in Hyderabad,Hyderabad Sri Rama Navami Shobha Yatra News,Telangana News,Telangana Traffic Restrictions Latest Updates

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అనేక ప్రాంతాల్లోని మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని పోలీసులు తెలిపారు. శ్రీరామ నవమి శోభాయాత్ర ఊరేగింపు రేపు ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో రాత్రి 7 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్ పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి కూడలి, కోటి, సుల్తాన్ బజార్ మీదుగా ఊరేగింపు సాగుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ వ్యామశాలకు వెళ్లే నిర్దేశిత మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించబడుతుంది. దీంతో వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని హనుమాన్ టేకిడి వద్ద సీతా రామ్ బాగ్ ఆలయం నుండి హనుమాన్ వ్యాయంశాల వరకు రంగుల శోభాయాత్రను నిర్వహిస్తుందని సమితి ప్రతినిధులు భగవంతరావు పవార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సమితి ప్రతినిధులు భగవంతరావు పవార్, గోవింద్ రాఠి, శ్రీరామ్ వ్యాస్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన శోభాయాత్ర వివరాలు తెలియజేశారు. సాయంత్రం హనుమాన్‌ వ్యాయామశాల పాఠశాలలో జరిగే బహిరంగ సభకు శ్రీ కాశీ సుమేరు పీఠాధీశ స్వామి నరేంద్రానంద సరస్వతి ముఖ్య అతిథిగా, సంతభోమ రామ్‌జీ మహరాజ్‌ అతిథిగా విచ్చేయనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు సీతా రామ్‌బాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమై దాదాపు 6 కిలోమీటర్ల మేర కొనసాగి రాత్రి 7 గంటలకు హనుమాన్‌ వ్యాయంశాల వద్ద ముగుస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా శోభా యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొననున్నారని భగవంతరావు పవార్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =