వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలంతా సత్తా చాటాలి : లోకేశ్‌

TDP National General Secretary Nara Lokesh Gives Advice Party Leaders To Work Together For Coming Elections in AP,TDP National General Secretary,TDP National General Secretary Nara Lokesh,Nara Lokesh Gives Advice,Nara Lokesh Advice Party Leaders To Work Together,Nara Lokesh Advice For Coming Elections in AP,Mango News,Mango News Telugu,All TDP leaders, next elections, Lokesh, Yuvagalam Yatra in Palnadu district, Yuvagalam Yatra, Palnadu district,Nara Lokesh Latest News,Nara Lokesh Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 15 తరువాత కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాకు చెందిన పార్టీ నేతలు లోకేశ్ తో సమావేశమయ్యారు. జిల్లాలో పాదయాత్ర.. పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని నేతలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల ఖరారుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ పార్టీ వ్యవహారాల గురించి నారా లోకేశ్ ఆరా తీశారు. సీట్ల ఖరారుపై ముందుగానే నిర్ణయాలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. గురజాలలో నారా లోకేశ్‌ను టీడీపీ నేత కేశినేని చిన్ని కలిశారు. వచ్చే ఎన్నికల్లో చిన్నికి విజయవాడ లోక్ సభ సీటు ఖాయమనే ప్రచారం వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి విజయవాడ నగర పరిధిలోని మూడు స్థానాలపై తన దగ్గర ఉన్న సమాచారంపై లోకేశ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. త్వరలో కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే యాత్ర గురించి చర్చించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో చిన్ని నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వరుసగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎపుడు ముందుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీలకతీతంగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =