13 గంటలు క్యాబ్‌లో తిరిగి డబ్బులు ఎగ్గొట్టిన మహిళ.. ట్విట్టర్‌లో వీడియో వైరల్‌

Gurgaon Woman Travels in Cab For 13 hours Refuses to Pay Fare For Driver,Gurgaon Woman Travels in Cab,Woman Travels in Cab For 13 hours,Gurgaon Woman Refuses to Pay Fare For Driver,Refuses to Pay Fare For Driver,Gurgaon Woman Travels 13 hours,Mango News,Mango News Telugu,Gurugram,Woman in cab for 13 hours,Medanta Hospital, cab driver,cab driver is Deepak,Gurgaon Woman Latest News,Gurgaon Woman Latest Updates,Gurgaon Woman Live News,Woman in cab for 13 hours Latest News

గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌లోని సైబర్ సిటీలో ఓ మహిళ.. క్యాబ్‌లో 13 గంటల పాటు ప్రయాణించింది. చివరికి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో తనపై వేధింపుల కేసు పెడతానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి డబ్బులు కట్టకుండానే వెళ్లిపోయింది. సదరు మహిళ.. క్యాబ్ డ్రైవర్‌తో, పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జ్యోతి అనే మహిళ అర్ధరాత్రి మేదాంత ఆస్పత్రి సమీపం నుంచి ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పుతూనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తరచూ డెస్టినేషన్లను మారుస్తూ ఉండటంతో.. అసలెక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పాలని అడిగానని, తను చెప్పకపోవడంతో సైబర్ సిటీలో డ్రాప్ చేసినట్లు దీపక్ చెప్పారు. ట్రిప్ ముగిసిన తర్వాత ఆ మహిళ డబ్బు ఇవ్వలేదని, గట్టిగా అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు.

ఎంతకూ జ్యోతి డబ్బులు చెల్లించకపోవడంతో.. గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు డ్రైవర్ దీపక్. పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తానని జ్యోతి చెప్పినప్పటికీ.. రెండు గంటలు అయినా డబ్బులు పంపించలేదని దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ జ్యోతి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో మహిళ రికార్డు చేసిన ట్విట్టర్‌లో సదరు వీడియోను పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

క్యాబ్‌లో గంటలకు గంటలు ప్రయాణించి చివరికి డబ్బులు చెల్లించకుండా డ్రైవర్లతో గొడవలకు దిగడం, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించడం జ్యోతికి ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలా చేసినట్లు దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే మహిళ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సదరు మహిళ క్యాబ్‌లు బుక్ చేసుకుంటూ.. వేధింపుల కేసులో ఇరికిస్తానని డ్రైవర్లను బెదిరిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఆ మహిళపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nine =