ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లను తక్షణమే ఆదుకోవాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

CM YS Jagan, Mango News, Nara Lokesh, Nara Lokesh over Private Teachers Problems, Nara Lokesh Over Private Teachers Problems In Andhra Pradesh, Nara Lokesh Writes a Letter to CM Jagan, Nara Lokesh Writes a Letter to CM YS Jagan, Nara Lokesh Writes a Letter to CM YS Jagan over Private Teachers Problems, Nara Lokesh Writes a Letter to CM YS Jagan over Private Teachers Problems In AP, Private Teachers Problems, Private Teachers Problems In Andhra Pradesh, Private Teachers Problems In AP

రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు.” రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలు పునః ప్రారంభం రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. గత 5 నెలల్లో, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5లక్షల మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నారు” అని నారా లోకేష్ తెలిపారు.

బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారటం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నెలకి 2 వేల రూపాయిల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందించింది. కర్ణాటక ప్రభుత్వంనెలకి 5 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందించింది. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =