అన్‌లాక్‌ 3 లో భాగంగా ఏపీకి వచ్చేవారికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం

AP Govt Gives Relaxations to People to who Comes Into State, AP Lockdown News, AP Unlock 3 Guidelines, AP Unlock 3 News, AP Unlock 3 Rules, AP Unlock 3 Updates, AP Unlock 3.0, Unlock 3.0, Unlock 3.0 In AP

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్‌ 3.0 నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ‌ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సడలింపులు ఇచ్చింది. ఆగస్టు 2, ఆదివారం నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు ఆటోమెటిక్‌ ఈపాస్‌ జారీ చేయనున్నారు. “ఏపీకి వచ్చే వారంతా ముందుగా స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే ఆటోమేటిక్‌గా ఈ-పాస్ మొబైల్ కి మరియు ఈ-మెయిల్‌కి వస్తుంది. అలా వచ్చిన ఈ-పాస్ తో పాటుగా గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి రావొచ్చని” రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఈ రోజు వెల్లడించారు. ఈ-పాస్ నమోదు రాష్ట్రానికి వస్తున్నా వారి సంఖ్యను గుర్తించడానికి మాత్రమేనని, అనంతరం స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తారని కృష్ణబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =