‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకంలోకి మరో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం

3 More States and one UT Joins in One Nation One Ration Card, national news, One Nation One Ration Card, One Nation One Ration Card Scheme, One Nation One Ration Card Scheme News, One Ration Card Scheme

ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలోకి తాజాగా మరో మూడు రాష్ట్రాలు మణిపూర్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కశ్మీర్‌ కూడా చేరాయి. ఇప్పటికే 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు భాగమవగా, ఆగస్టు 1 నాటికి మొత్తం 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ‘ఒకే దేశం ఒకే కార్డు’ పథకానికి అనుసంధానమయ్యాయి. ఒకే దేశం-ఒకే కార్డు అమలు పురోగతిపై ఈ రోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాశ్‌ పాశ్వాన్‌ సమీక్షించారు.

ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, దాద్రా అండ్ నగర్‌ హవేలీ, డామన్ అండ్ డయ్యు, గోవా, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము అండ్ కశ్మీర్‌, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో దేశంలో దాదాపు 65 కోట్ల జనాభా (80 శాతం పేదలు) రేషన్‌ కార్డుల ద్వారా ఈ 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వచ్చే ఏడాది మార్చి నాటికి నేషనల్‌ పోర్టబులిటీ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =