అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్ బ్యాంక్

Mango News, World Bank decides not to fund project Andhra, World Bank Drops $300 Million Amaravati Project, World Bank Drops $300 Million Funding for Andhra Pradesh, World Bank drops $300 million in funding for Amaravati Capital City, World Bank Drops Its $300 Million Promise For Amaravati Construction Project, World Bank drops plan to lend $300 mn for new Andhra Pradesh

ప్రపంచ బ్యాంకు ఏపీ కొత్త ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది,గతంలో అమరావతి నిర్మాణం కొరకు నిధులు ఇవ్వాలంటూ అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కు వినతి పత్రం ఇచ్చింది,పరిశీలించిన తరువాత 300 మిలియన్ డాలర్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని సిఆర్డిఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం తెలియజేసారు.

రైతులు, కొన్ని ప్రజా సంఘాలు ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు,రుణం అందించేందుకు సిద్దమైన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానెల్ కు పర్యావరణ పరిరక్షణ, జీవనాధారానికి భంగం వాటిల్లుతుందని చేసిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు వెనక్కు తగ్గి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సిఆర్డిఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు తప్పుకోవడం, ఇతర అంశాలపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తదుపరి కార్యాచరణ రూపొందిస్తుందని ఆశిస్తున్నాం అని తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=UYR1VsazJVA]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =