కొత్త పురపాలక చట్టాన్ని వివరించిన సీఎం కెసిఆర్

7 new municipal corporations to come up in Telangana, CM KCR Explains About New Municipal Act In Assembly, KCR Speaks Over New Municipal Act, Mango News, New Municipal Act explained By KCR, New municipal bill approved by Telangana assembly, Telangana cabinet meet to approve Municipal Act, Telangana Political News

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి, అందులో భాగంగా గురువారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర పురపాలక చట్టం -2019 బిల్లు పై చర్చ జరుగుతుంది. ఈ చట్టంలోని ముఖ్యంశాలను కెసిఆర్ ఈ రోజు వివరించారు, అవినీతి రహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తెస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు పౌర సదుపాయాలే లక్ష్యంగా కొత్త చట్టం అమలు చేస్తామని ప్రకటించారు.

చట్టంలో కొన్ని ముఖ్యంశాలు:

  • 75 గజాల లోపు ఇంటి నిర్మాణం పై రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూపాయి మాత్రమే, జీప్లస్ వరకు 1 రూపాయితో రిజిస్ట్రేషన్, అనుమతి అవసరం లేదు
  • మునిసిపల్ అధికారులు అవినీతి లేదా నిర్లక్ష్యానికి పాల్పడితే కఠినమైన మరియు తక్షణ చర్యలు
  • తెలంగాణ పౌరులకు ఈ చట్టం వల్ల అధిక ప్రయోజనం, ఇది సిటిజెన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలసీ
  • ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవు
  • యజమానులే ఇంటి నిర్మాణానికి స్వయంగా సర్టిఫికెట్ ఇవ్వాలి, తప్పుగా ఇస్తే 25 రేట్లు జరిమానా
  • జిల్లా కలెక్టర్లకు కీలక అధికారాలు, తనిఖీ కి ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు
  • కొత్త డోర్ నంబర్ల ఏర్పాటు, ప్రతి ఇంటికి కొత్త నెంబర్ ఉండాలి
  • ప్రతి ఏడాది గ్రామాలకు 3,200 కోట్ల నిధులు
  • 500 వందలకు పైగా జనాభా ఉండే పంచాయితీలకు రూ. 5 లక్షల కనీస నిధులు
  • పట్టణాలకు 2,060 కోట్ల నిధుల కేటాయింపు
  • ఈ బిల్లు తెలంగాణ సమస్యలను తగ్గించడానికి మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది
  • అధికారులు మరియు రాష్ట్ర ప్రజల మధ్య స్నేహపూర్వక మరియు పారదర్శక సంబంధాన్ని కలిగి ఉంటుంది.
  • ప్రస్తుత చట్టం ప్రకారం కొన్ని నిబంధనలు సమయంతో మార్చాల్సిన అవసరం ఉంది
  • పౌరులకు సౌలభ్యం మరియు చట్టపరమైన పనిలో కొత్త ధోరణి కోసం సాంకేతికత వినియోగం
  • కొత్త మునిసిపల్ బిల్లు ప్రకారం, జిల్లా కలెక్టర్లకు పట్టణ స్థానిక సంస్థలకు అధిక అధికారాలు అప్పగించబడతాయి, అక్కడ వారు తమ జిల్లాలోని ఎన్నికైన ప్రతినిధులు మరియు స్థానిక సంస్థల అధికారులపై సస్పెన్షన్ వంటి కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు
  • మునిసిపల్ ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరగాల్సి ఉన్న సమయంలో ఈ కొత్త చట్టం వచ్చింది
  • ఈసీ విధుల్లో కలగజేసుకోము, కానీ మునిసిపల్ ఎన్నికలు తేదీలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదే
  • గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కు మున్సిపల్ బిల్లు వర్తించదు, ఎందుకంటే అది హైదరాబాద్ మునిసిపల్ యాక్ట్ (హెచ్ఎంఏ) కిందకి వస్తుంది 
  • రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్లను పెంచాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది, దీని తరువాత రాష్ట్రంలో 13 మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి
  • తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్ను స్థాపించడానికి కూడా రాష్ట్రం ప్రణాళిక వేసింది, ఇక్కడ ప్రజా ప్రతినిధులు మరియు మునిసిపల్ అధికారులు క్రమం తప్పకుండా సరైన శిక్షణ పొందుతారు.

 

[subscribe]
[youtube_video videoid=gD6rvvyBXxw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =