వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు మళ్లుతుందా..?

Will YCPs Vote Bank Shift to Congress, Vote Bank Shift to Congress, YCPs Vote Bank Shift, YCPs Vote Bank, YS Sharmila, CM Jagan, Congress, YCP, AP politics, Latest YCPs Vote Bank News, YCPs Vote Bank News Upadte, Jagan, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YS Sharmila, CM Jagan, Congress, YCP, AP politics

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ ముగిసింది. ఎట్టకేలకు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే విలీనం చేయాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆలస్యమయింది. చివరికి తన పార్టీని విలీనం చేసి షర్మిల కాంగ్రెస్‌లో పార్టీలో చేరిపోయారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని చెప్పుకొచ్చిన షర్మిల.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏపీపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ మాత్రం ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించాలని అనుకుంటున్నారట. దాదాపు షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. అయితే అటు షర్మిల కూడా తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఖాయమని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే షర్మిల జనాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల భర్త, క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏపీలో దాదాపు 20 శాతం మంది క్రిస్టియన్లు ఉన్నారు. వారిని వైసీపీవైపు తిప్పేందుకు తీవ్రంగా చమటోడ్చారు. అయితే షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం ద్వారా.. అనిల్ క్రిస్టయన్ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించే అవకాశం ఉంది. దీంతో రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్ బలపడితే క్రిస్టియన్ ఓట్లనీ అటే వెళ్లిపోతాయని అంచనా వేస్తున్నారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు.

అటు షర్మిల కూడా ఇప్పటి నుంచే క్రైస్తవుల మనసులు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మణిపూర్‌లో 2 వేల చర్చిలను కూల్చివేశారని.. ఎంతో మంది క్రిస్టయన్లపై దాడులు చేశారని అన్నారు. తాను కూడా క్రిస్టయన్‌నేనని అందుకే బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇకపై క్రిస్టియన్లకు అన్యాయం జరగకుండా తనవంతు కృషి చేస్తానని.. ఆ వర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు షర్మిల.

అయితే క్రిస్టియన్లతో పాటు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఏపీలో కాంగ్రెస్‌కు అతిపెద్ద ఓటు బ్యాంకు. కాంగ్రెస్ ఏపీలో ఉనికిని కోల్పోయి.. కనుమరుగైపోవడంతో.. ఈ వార్గాల వారంతో వైసీపీ వైపు మళ్లారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరి.. పార్టీని బలపర్చడం ద్వారా ఆయా వర్గాలన్నీ మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే నష్టపోయేది వైసీపీనేనని పొలిటికల్ ఎక్స్‌పర్స్ట్ అంటున్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే.. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వైసీపీకీ పెద్ద మైనస్ అవుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + four =