రామ్‌లల్లా ఉండేది ఇక టెంటులో కాదు.. దివ్యమందిరంలో: మోడీ

Rams Life Was No Longer In The Tent In The Divine Temple Says Modi, Rams Life Was No Longer In The Tent, Rams Life Was In The Divine Temple Says Modi, Rams Life Was In Temple Says Modi, Ram Mandir, Ayodya, PM Modi, Balaramudu, Ram Mandir Pran Pratishtha, Ram Mandir Inauguration, Latest Ayodya News, Ayodya News Updates, Mango News, Mango News Telugu
Ram Mandir, Ayodya, PM Modi, Balaramudu

రామ్‌లల్లా ఇక టెంటులో ఉండాల్సిన అవసరం లేదని.. దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు ముగిసిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో బలిదానాలు.. పోరాటాలు.. త్యాగాల ఫలితంగా రాముడు తిరిగి అయోధ్యకు చేరుకున్నాడని మోడీ పేర్కొన్నారు. 22 జనవరి 2024 కేవలం తేది మాత్రమే కాదన్న మోడీ.. కొత్త కాల చక్రానికి ప్రతీక అని వెల్లడించారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని వివరించారు. ఇప్పుడే కాదు.. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ఎవరూ మర్చిపోరని చెప్పుకొచ్చారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రామ మందిరం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేశామని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్లకు మన కల నెరవేరిందని.. బాలరాముడు మందిరంలో కొలువుదీరారని అన్నారు. ఈ కార్యం ఎన్నో ఏళ్ల ముందే జరగాల్సిందన్న మోడీ.. ఆలస్యం అయినందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అలాగే శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని.. తాను ఎంతో అదృష్టవంతుడనని మోడీ పేర్కొన్నారు.

ఈ శుభగడియల కోసం 11 రోజుల పాటు దీక్ష చేపట్టానని చెప్పిన మోడీ.. దేశవ్యాప్తంగా రాముడితో అనుబంధంగావున్న క్షేత్రాలన్నింటిని సందర్శించానని వివరించారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించానని.. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలను సందర్శించానని వివరించారు. రామనామం ఈ దేశ ప్రజల కంకణంలో నిండి ఉందని.. కొందరు వ్యక్తులు మాత్రం మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. ఇది కేవలం విగ్రహ ప్రాణ ప్రతిష్టే కాదన్న మోడీ.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ట అని వివరించారు.

ఇకపోతే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు ప్రాణప్రతిష్ట క్రతువును ప్రారంభించారు. ముందుగా ప్రధాని మోడీ బలరాముడికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించి పూజలు నిర్వహించారు. సరిగ్గా 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్యలో దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ట క్రతువును చేపట్టారు. ఆ సమయంలో రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో మోడీ శ్రీరాముడికి కాటుక దిద్దారు. ఆ తర్వాత రామ్ లల్లాకు అద్దాన్ని చూపించారు. అనంతరం 108 దీపాలతో రామ్ లల్లాకు మహా హారతి ఇచ్చి ప్రాణప్రతిష్ట క్రతువును ముగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =