రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్

YSRCP Leader Vijayasai Reddy and Tollywood Writer Vijayendra Prasad Takes Oath As Rajya Sabha MPs Today, Tollywood Writer Vijayendra Prasad Takes Oath As Rajya Sabha MP Today, YSRCP Leader Vijayasai Reddy Takes Oath As Rajya Sabha MP Today, Rajya Sabha MP, Tollywood Writer Vijayendra Prasad, Writer Vijayendra Prasad, Vijayendra Prasad, YSRCP Leader Vijayasai Reddy, Vijayasai Reddy, YSRCP Leader, Rajya Sabha MP News, Rajya Sabha MP Latest News, Rajya Sabha MP Latest Updates, Rajya Sabha MP Live Updates, Mango News, Mango News Telugu,

వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరియు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు వీరిద్దరి చేత ప్ర‌మాణం చేయించారు. ఇక విజయసాయి రెడ్డి రెండవ పర్యాయం రాజ్యసభకు ఎన్నికవగా.. విజయేంద్ర ప్రసాద్ తొలిసారిగా ఎన్నిక కావడం విశేషం. కాగా విజ‌యేంద్ర ప్రసాద్ రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. అలాగే ఆయన, ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి అన్న సంగతి తెలిసిందే.

ఇక ప్ర‌మాణ‌ స్వీకారం అనంత‌రం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో విజ‌యేంద్ర ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్య‌స‌భ‌కు వ‌స్తాన‌ని తాను ఎప్పుడూ ఊహించ‌లేదని, రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. సినిమాలకు రాసిన త‌న‌ క‌థ‌లే త‌న‌ను రాజ్య‌స‌భ‌కు తీసుకొచ్చాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. రాజ్య‌స‌భ‌కు నామినేట్ కావ‌డం త‌న‌ బాధ్య‌త‌ను మ‌రింత పెంచిందని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నాని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =