ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌.. జూలై 21న కౌంటింగ్

Presidential Polls 2022 Voting Ends at Parliament and Counting To be Held on July 21, Presidential Polls 2022 Counting To be Held on July 21, Presidential Polls 2022 Voting Ends at Parliament, Presidential Polls 2022 Voting Ends, Presidential Elections-2022 Polling, India To Elect 15th President Of India On July 18, 15th President Of India, India To Elect 15th President Of India, elections for the 15th President of India are scheduled on the 18th of July, NDA candidate Draupadi Murmu, UPA candidate Yashwant Sinha, United Progressive Alliance, National Democratic Alliance, next President of India post, Presidential elections 2022, 2022 Presidential elections, Presidential elections, Presidential elections News, Presidential elections Latest News, Presidential elections Latest Updates, Presidential elections Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నిలవగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. అయితే దేశవ్యాప్తంగా శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా, బిజూ జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ వంటి పలు ప్రాంతీయ పార్టీలు ముర్ముకు తమ మద్దతును అందించడంతో ఆమె విజయం లాంఛనమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక రాష్ట్రాల అసెంబ్లీల నుంచి బ్యాలెట్ బాక్స్ లు రోడ్డు మరియు వాయుమార్గం ద్వారా ఢిల్లీకి చేర్చనున్నారు. వీటితో పాటుగా ఆయా రాష్ట్రాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉంటారని అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ వెల్లడించారు. పార్లమెంట్‌లో మొత్తం ఓటింగ్ శాతం 99.18 నమోదైనట్లు, అలాగే దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఆయన ప్రకటించారు. ఇక ఎన్నికల ఫలితాలను ఈ నెల 21న ప్రకటించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =