తెలుగు నిర్మాత‌ల మండ‌లి కొత్త ప్ర‌తిపాద‌న‌లు.. ఓటీటీ రిలీజ్, సినిమా టికెట్ ధ‌ర‌లపై కీలక నిర్ణయాలు

Telugu Film Chamber of Commerce Imposes New Rules For OTT Releases and Movie Ticket Rates, Telugu Film Producers Council Imposes New Rules For OTT Releases and Movie Ticket Rates, New Rules For OTT Releases and Movie Ticket Rates, New Rules For Movie Ticket Rates, New Rules For OTT Releases, Telugu Film Producers Council, TFPC Imposes New Rules For OTT Releases and Movie Ticket Rates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Latest News, Tollywood Film Producers, Film Producers, Telugu Film Producers, Telugu Movie Producers, Film Producers Chambers, Movie Ticket Prices, Mango News, Mango News Telugu,

ఇక నుంచి థియేటర్లలో విడుదల చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు పది వారాల తర్వాత, చిన్న బడ్జెట్ చిత్రాలు నాలుగు వారాల తర్వాతే ఓటీటీలలో విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలుగు నిర్మాత‌ల మండ‌లి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న క్లిష్ట ప‌రిస్థితుల‌పై చ‌ర్చించేందుకు సినీ నిర్మాత‌ల మండ‌లి మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైంది. సమావేశంలో భాగంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంది. ఓటీటీ, వర్చువల్‌ ప్రింట్ ఛార్జీలు, సినిమా టికెట్ ధ‌ర‌లు మొదలైన వాటిపై కొన్ని నిబంధనలను విధించింది.

దీని ప్రకారం.. భారీ సినిమాల‌ను థియేట‌ర్‌లో విడుద‌లైన 10 వారాల త‌ర్వాతే ఓటీటీకి ఇవ్వాల‌ని, అలాగే చిన్న బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాల‌ను మాత్రం 4 వారాల త‌ర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవచ్చ‌ని తెలిపింది. భారీ బడ్జెట్ సినిమాలను కూడా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడం వల్ల థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. దీనిని అధిగమించేందుకు ఈ ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ ధరలు సినిమా ప్రేక్షకులకు ఖర్చును పెంచుతున్నాయి. అందుకే సింగిల్ స్క్రీన్‌ థియేటర్లపై దృష్టి వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మేనేజర్ల వ్యవస్థ నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తోందని, దీనిని రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానించారు.

ఇక సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు వర్చువల్‌ ప్రింట్ ఛార్జీలను సదరు ఎగ్జిబిట‌ర్లే చెల్లించాల‌ని తీర్మానించింది. ఇక సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని సాధార‌ణ థియేట‌ర్లు, సీ-క్లాస్ సెంట‌ర్ల‌లో టికెట్ ధ‌ర‌ల‌ను రూ.100, రూ.70 (జీఎస్టీతో క‌లిపి) కు మించి ఉండకూడదని పేర్కొంది. మ‌ల్టీప్లెక్స్‌ల్లో మాత్రం జీఎస్టీతో క‌లిపి రూ.125గా ప్రతిపాదించింది. అలాగే మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు, పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండేలా, అదే సి-సెంటర్లలో రూ.100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + fifteen =