విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

Telangana SC Development Minister Koppula Eshwar Surprise visit to SC Gurukulam Shaikpet, Telangana SC Development Minister Surprise visit to SC Gurukulam Shaikpet, TS SC Development Minister Koppula Eshwar Surprise visit to SC Gurukulam Shaikpet, SC Development Minister Koppula Eshwar Surprise visit to SC Gurukulam Shaikpet, Minister Koppula Eshwar Surprise visit to SC Gurukulam Shaikpet, Koppula Eshwar Surprise visit to SC Gurukulam Shaikpet, SC Gurukulam Shaikpet, Shaikpet SC Gurukulam, SC Gurukulam, Telangana SC Development Minister Koppula Eshwar, SC Development Minister Koppula Eshwar, Telangana SC Development Minister, Minister Koppula Eshwar, SC Gurukulam Shaikpet News, SC Gurukulam Shaikpet Latest News, SC Gurukulam Shaikpet Latest Updates, SC Gurukulam Shaikpet Live Updates, Mango News, Mango News Telugu,

విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గోల్కోండ సమీపాన ఉన్న షేక్ పేట ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీని (సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్) మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూమ్స్, కారిడార్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులను పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆలనాపాలన గురించి ఉపాధ్యాయులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇక్కడ చదువుకుంటున్నారని, వీరిని మీ సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలని, వీరి ఆలనాపాలన బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు.

విద్యార్థులకిచ్చే తాగునీటిని కాచి వడబోసి గోరువెచ్చగా, భోజనాన్ని వేడివేడిగా అందించాలని మంత్రి ఆదేశించారు. గురుకుల విద్యా విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశమంతటికి ఆదర్శమని, ఇక్కడ చక్కని విద్యాబుద్ధులతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏటా లక్షా 25వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. చక్కని ఫలితాలు కూడా వస్తున్నాయని, అన్ని రంగాలలో బాగా రాణిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వీరిపై మరింత శ్రద్ధ చూపి ఉత్తమ పౌరులుగా, ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంత్రి తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, వెల్ నెస్ సెంటర్, ఇండోర్ స్టేడియం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, మాటామంతీ జరిపారు. బోధన జరుగుతున్న తీరు, వడ్డిస్తున్న భోజనం, ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధాసక్తులు, అందుతున్న సౌకర్యాల గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =