ఆస్కార్‌ 2020 విజేతలు వీరే

2020 Oscar Winners, 2020 Oscars Winners List, Awards List Of Oscar 2020 Winners, Mango News, Mango News Telugu, Oscar, Oscar 2020 Winners, Oscar Awards, Oscar Awards 2020, Oscar Awards 2020 Winner List, Oscar Winners 2020, Oscar Winners List, Oscars 2020
ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసిన 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఫిబ్రవరి 10, సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్‌ నటీనటులంతా హాజరయ్యారు. ఈసారి అవార్డుల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కొరియా చిత్రం ‘పారాసైట్‌’ నాలుగు ఆస్కార్‌ అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌ విభాగాల్లో ‘పారాసైట్‌’ అవార్డులు దక్కుంచుకుంది. జోకర్‌ సినిమాలో నటించిన జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో నటనకు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్నాడు. జూడీ చిత్రంలో నటనకు గానూ రెంజి జెల్వెగర్ ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది.

ఆస్కార్‌ 2020 విజేతలు వీరే:

 • ఉత్తమ చిత్రం: పారాసైట్‌
 • ఉత్తమ నటుడు: జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
 • ఉత్తమ నటి: రెంజి జెల్వెగర్ (జూడి)
 • ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్‌పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
 • ఉత్తమ సహాయక నటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
 • ఉత్తమ దర్శకుడు: బాంగ్ జోన్-హో(పారసైట్)
 • ఉత్తమ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లే: బాంగ్‌ జూన్‌ హొ
 • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌
 • బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
 • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: 1917
 • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌: అమెరికన్ ఫ్యాక్టరీ
 • బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
 • ఉత్తమ సంగీతం: జోకర్‌ (హిల్దార్‌)
 • బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్: ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
 • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: బాంబ్‌ షెల్‌
 • ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌: అమెరికర్‌ ఫ్యాక్టరీ
 • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
 • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌: లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
 • బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌: హెయిర్‌ లవ్‌
 • బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్ వి ఫెరారీ
 • బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: 1917
 • ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917
 • బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్ వి ఫెరారీ
 • ఉత్తమ​ ప్రొడక్షన్ డిజైన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
 • బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది నైబర్స్‌ విండో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here