కరోనా నేపథ్యంలో కేంద్రం అలర్ట్.. అన్ని విమానాశ్రయాలలో ర్యాండమ్ పరీక్షలు, మార్గదర్శకాలు జారీ

ndian Govt Issued Guidelines For International Passengers Random Testing To be Held at All Airports Amid Covid Surge,Indian Govt Issued Guidelines,International Passengers Random Testing,Covid Surge,Mango News,Mango News Telugu,COVID Outbreak,COVID Outbreak Latest News and Updates,COVID Outbreak News and Live Updates,Indian Medical Association News and Updates,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో బీఎఫ్‌-7 కోవిడ్‌ వేరియంట్ల కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో 2% మందికి శుక్రవారం నుంచి ర్యాండమ్‌గా కరోనా టెస్ట్ లు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ విమాన ప్రయాణీకులకు సంబంధించి మరికొన్ని నిబంధనలను అమలు చేయాలని, అలాగే ఇతర ముందస్తు చర్యలను కూడా పాటించాలని సూచించింది. ఇకపై ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • ప్రతీ ప్రయాణీకుడు తమ దేశానికీ చెందిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది.
  • 12 ఏళ్ల లోపు పిల్లలకు ర్యాండమ్ టెస్టింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
  • అయితే, ఒకవేళ వారిలో కోవిడ్ లక్షణాేలు కనిపిస్తే, పరీక్ష జరిపి, చికిత్స కోసం ప్రత్యేక వైద్య కేంద్రానికి పంపిస్తారు.
  • విమానంలో కోవిడ్ లక్షణాలున్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే వారిని ఐసోలేట్ చేసి, విమానం గమ్యస్థానం చేరుకున్న తరువాత కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం పరీక్ష జరిపి, చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రికి తరలిస్తారు.
  • శ్యాంపిల్ ఇచ్చిన తరువాత ప్రయాణికులు పరీక్ష ఫలితం వచ్చే వరకు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు.
  • ఇక ర్యాండమ్ పరీక్ష కోసం ఎంపిక చేసిన వారిలో ఎవరికైనా పాజిటివ్ గా తేలితే, వారికి సమాచారమిచ్చి, ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా కోరతారు.
  • అలాగే ఆ ప్రయాణీకులు నివసించే ప్రాంతంలోని వైద్య అధికారులకు సమాచారమిచ్చి, వారి శ్యాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తారు.
  • కాగా ర్యాండమ్ పరీక్ష ఎవరికి జరపాలన్నది సంబంధిత ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్ణయం మేరకు ఉంటుంది. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =