దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఇప్పటికే 10.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ

30 Lakh Vaccination Doses were Administered on April 11, AP Corona Vaccine, AP Tika Utsav, celebrate vaccination drives, India celebrates Tika Utsav to combat Covid-19, Mango News, Nearly 30 Lakh Vaccination Doses were Administered on April 11, TIKA UTSAV, Tika Utsav across India, Tika Utsav beginning of another major war against corona, Tika Utsav beginning of second big war on Covid-19, Tika Utsav In AP, Tika Utsav In India, Tika Utsav News, Tika Utsav Udpates, vaccine Utsav

దేశంలో ఏప్రిల్ 11 (మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి) నుంచి ఏప్రిల్ 14 (బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) వరకు ‘టీకా ఉత్సవ్’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో దృష్టి సారించి 45 ఏళ్ల పైబడినవారికీ 100 శాతం వ్యాక్సిన్ వేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచించారు. టీకా ఉత్సవ్ సందర్భంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని, 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు సహాయం చేయాలని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్ మొదటిరోజైన ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా 63,800 కోవిడ్ వాక్సినేషన్ సెంటర్స్ లో దాదాపు 30 లక్షల (29,33,418) మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

మరోవైపు సోమవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 10.45 కోట్లు (10,45,28,565) దాటినట్టు తెలిపారు. ఇందులో 90,13,289 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 55,24,344 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 99,96,879 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 47,95,756 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు), 3,20,46,911 మంది 45-60 ఏళ్ల వారికీ (మొదటి డోసు), 6,78,360 మంది 45-60 ఏళ్ల వారికీ (సెకండ్ డోసు), 4,05,30,321 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 19,42,705 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =