పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూలై 1 నుండి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

AAP Govt in Punjab Announced 300 Units of Free Power to Every Household from July 1st, AAP Announces 300 Units Free Power To Every Punjab Home from July 1st, 300 Units Free Power To Every Punjab Home from July 1st, 300 Units Free Power To Every Punjab Home, 300 Units Free Power, AAP Govt in Punjab, Punjab AAP govt fulfils Their promise, 300 units of free power per Every Punjab Home from July 1, AAP Govt in Punjab announces 300 units of free electricity in Every Punjab Home from July 1, 300 units of free electricity, free electricity, AAP Govt in Punjab announces free electricity, Free Electricity up to 300 Units To Every Punjab Home from July 1st, Free electricity in Punjab was one of the major promises of AAP Party in its Punjab assembly election campaign, Punjab Free electricity Latest News, Punjab Free electricity Latest Updates, Punjab Free electricity Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాక మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, నెల రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించారు. జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.

ముందుగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఇటీవలే సీఎం భగవంత్ మాన్ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తో సమావేశమై ఈ అంశంపై కీలకంగా చర్చించారు. అనంతరం అతి త్వరలోనే పంజాబ్ ప్రజలకు శుభవార్త అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకే జూలై 1 నుంచి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై పంజాబ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. మరోవైపు ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో కూడా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 20 =