పార్లమెంట్ లో ఓబీసీ బిల్లుకు ఆమోదం

After Loksabha OBC Bill Passed in Rajyasabha Today, Andhra Pradesh CM YS Jagan, Bill to allow states, Lok Sabha passes constitution amendment bill, Mango News, OBC Bill, OBC Bill Passed, OBC Bill passed in Lok Sabha, OBC Bill passed in Rajyasabha, OBC Bill Passed in Rajyasabha Today, Parliament Monsoon Session, Parliament monsoon session live updates, Parliament passes bill to give states power, Parliament proceedings updates, UTs to prepare own OBC list passed

ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఓబీసీ బిల్లు (రాజ్యాంగం 127 సవరణ బిల్లు-2021) ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందగా, గురువారం నాడు రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించినట్లయింది. ఓబీసీ బిల్లు ఆమోదం ద్వారా ఉద్యోగాలు మరియు విద్యాసంస్థలలో రిజర్వేషన్ల కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వారి స్వంత ఓబీసీ జాబితాలను రూపొందించే అధికారాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది.

రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ప్రవేశపెట్టారు. దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడానికి ఉపయోగపడే ఈ బిల్లును తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, మద్ధతు తెలిపిన ఇతర పార్టీలకు కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దేశంలో 671 కమ్యూనిటీల రిజర్వేషన్ల విషయంలో సహాయపడనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =