ఫిఫా ప్రపంచ కప్‌ 2022: మొరాకోపై 2-1తో ఘన విజయం, మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా

FIFA World Cup 2022 Croatia Defeats Morocco with 2-1 For 3rd Place,FIFA World Cup,Croatia Defeats Morocco,FIFA Croatia Defeats Morocco,FIFA World Cup-2022,FIFA World Cup Argentina,FIFA World Cup Croatia,FIFA World Cup Semifinals,Mango News,Mango News Telugu,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World Cup 2022 Schedule

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌ చివరి ఘట్టానికి చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్స్‌కు ముందు మూడో ప్లేస్ ప్లే-ఆఫ్ కోసం జరిగిన కీలక మ్యాచ్‌లో క్రొయేషియా ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొరాకోపై 2-1 తేడాతో విజయం సాధించి మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. క్రోయేషియా ఆటగాడు జోస్కో గ్వార్డియేల్ గేమ్ ఆరంభంలోనే 7వ నిమిషంలో గోల్ చేసి జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఖంగుతిన్న మొరాకో, క్రోయేషియా గోల్ పోస్టుపై దాడి తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఆట 9వ నిమిషంలో మొరాకో ఆటగాడు అచ్రఫ్ డారీ సహచరుల నుంచి అందుకున్న పాస్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి.

అయితే ఫస్టాఫ్ మరికొన్ని క్షణాల్లో ముగుస్తున్న తరుణంలో క్రోయేషియా స్టార్ ప్లేయర్ మిస్లావ్ ఓరిక్స్ గోల్ చేయడంతో తిరిగి క్రోయేషియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. దీంతో ఆధిక్యంలో ఉన్న క్రోయేషియా మ్యాచ్‌లో విజయం సాధించడమే కాక మూడో స్థానంలో నిలిచింది. కాగా గత ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఓడినా, గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌ వంటి దిగ్గజ జట్లను ఓడించిన మొరాకో టోర్నమెంటులో తన ఆటతీరుతో అభిమానులను మెప్పించింది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 8.30 గంటలకు అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 18 =