దేశంలో 82402 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.38 శాతం

India Reports 13154 New Covid-19 Cases, Omicron Variant Cases Tally Reaches to 961,Coronavirus, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, COVID-19, COVID-19 Cases In India, covid-19 new variant, India Omicron Cases, India’s COVID-19 And Omicron Update, Mango News, New Coronavirus Strain, New Covid 19 Variant, Omicron, Omicron cases, Omicron Cases In India, Omicron covid variant, Omicron Tally Reaches 961, Omicron variant, Update on Omicron

దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 13,154 కరోనా కేసులు నమోదవడంతో డిసెంబర్ 30, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,48,22,040 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 268 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,80,860కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

దేశంలో 82402 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.38 శాతం:

దేశంలో ప్రస్తుతం 82,402 (0.24%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 7,486 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,42,58,778 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 98.38 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. అలాగే డిసెంబర్ 29, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 67,64,45,395 కు చేరుకుంది. డిసెంబర్ 29న 11,99,252 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. మొత్తం 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడులో 45, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్ లో 16, హర్యానాలో 12, వెస్ట్ బెంగాల్ లో 11 కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 961 మంది బాధితుల్లో ఇప్పటికే 320 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eight =