ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amarnath Yatra Begins Today with First Batch of 2750 Pilgrims Union Home Minister Amit Shah Extends Wishes, Union Home Minister Amit Shah Extends Wishes, Amarnath Yatra Begins Today with First Batch of 2750 Pilgrims, First Batch of 2750 Pilgrims, 2750 Pilgrims, Amarnath Yatra Begins Today, Amarnath Yatra, Amarnath Yatra begins with first batch of pilgrims, Amit Shah Extends Wishes, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Union Home Minister, Amit Shah, Amarnath Yatra News, Amarnath Yatra Latest News, Amarnath Yatra Latest Updates, Amarnath Yatra Live Updates, Mango News, Mango News Telugu,

గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర నేటినుంచి ప్రారంభమయింది. 2,750 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్‌ బయలుదేరింది. హిమగిరుల్లో కొలువైన మహాదేవుడి దర్శనం కోసం జమ్ము నుంచి కశ్మీర్‌లోని పహల్‌గామ్‌, బాల్తల్‌ బేస్‌ క్యాంపులకు యాత్రికులు బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా బేస్ క్యాంపు నుంచి పాదయాత్రను ఆరంభించారు. వీరి యాత్రను జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ‘రక్షాబంధన్‌’ రోజు (ఆగస్టు 11)న ముగియనుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ యాత్రను భారతీయ సనాతన సంస్కృతి యొక్క అద్భుతమైన సంప్రదాయానికి చిహ్నంగా అమిత్ షా పేర్కొన్నారు. ఆ దేవదేవుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రయాణం సాఫీగా మరియు సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్” అని ట్విట్టర్‌లో తెలిపారు. ఇక యాత్రికులు సజావుగా సాగేందుకు మరియు వారు క్షేమంగా మరియు శాంతియుతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేశామని పీయూష్ సింగ్లా చెప్పారు. దీనికోసం బిఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ భద్రతా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here