వచ్చే వారం నుంచీ అమెరికాలో మారనున్న కరోనా కొత్త రూల్స్

America COVID 19, America Covid 19 News, America Covid-19 Cases, America New Covid 19 Guidelines, America New Covid 19 Guidelines For International Passengers, America New Covid 19 Guidelines For International Passengers From Next Week, America’s new COVID-19 rules for international travel, COVID-19 Travel Update, International Passengers, International Travel, Mango News, Mango News Telugu, New Covid 19 Guidelines For International Passengers, President Biden Announces New Actions to Protect Americans, US COVID-19 Travel Guidelines, USA New Covid 19 Guidelines For International Passengers

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రపంచ దేశాలు మళ్ళీ ఆంక్షల బాట పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. వచ్చేవారం నుంచీ అమెరికాలో కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. వచ్చే వారం నుంచీ ఇవి అమలులోకి రాబోతున్నాయి. ఈ నిర్ణయాల వలన అమెరికా ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఇతర దేశాలు వెళ్లి వచ్చే అమెరికా సిటిజన్స్ పై కూడా ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. వచ్చే వారం నుంచీ అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..

1. ప్రయాణ తేదీకి.. ముందు రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షనే పగణనలోకి తీసుకుంటారు.
2. ఇందులో నెగటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
3. వాక్సిన్ వేయించుకున్నా, వేయించుకోకపోయినా ఈ పరీక్ష తప్పనిసరి.
4. అమెరికా దేశంలో బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
5. ప్రజా రవాణా, పబ్లిక్ స్థలాల్లో మాస్కులు ధరించని వారికి 500 నుంచి 3,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు.
6. విదేశాలనుంచి అమెరికా వచ్చిన ప్రయాణీకులందరికీ మరలా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారు. ఒకవేళ అందులో నెగటివ్ వచ్చినప్పటికీ కొన్ని రోజులు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + seventeen =